రైతు వేదికలకు అన్నదాతల నిరసన సెగ

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లా పానగల్ – ఖాజీ రామారం రైతు వేదిక వద్ద రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ (Loan Waiver Funds) ప్రకటించినప్పటికీ, తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 300 మంది రైతులు రుణమాఫీకి అర్హులైనా, బ్యాంకుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాల వల్ల లబ్ధి పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఏపీజీవీబీ బ్యాంక్ (APGVB Bank).. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ (TGB) గా మారిన తర్వాత ఐఎఫ్ఎస్‌సీ (IFSC) కోడ్ మార్పులు సరిగ్గా అప్‌డేట్ కాకపోవడం సమస్యకు కారణమైంది.

ప్రభుత్వం జనవరి 1, 2025 నుంచే ఈ మార్పులు అమలు చేసినప్పటికీ, సాఫ్ట్‌వేర్ లోపాల వల్ల రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు (Loan Waiver Funds) చేరలేదు. రేషన్ కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా, వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా  అర్హత ఉన్నా.. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా.. కేవలం డేటా ఎంట్రీ లోపాల వల్ల తమకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం డబ్బులు ఇచ్చామని చెబుతోంది..  బ్యాంకు మాత్రం రాలేదంటోంది. మేమెవరిని నమ్మాలి? అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగినా సరైన సమాధానం దొరకడం లేదని వారు వాపోతున్నారు. ఈ పరిస్థితిలో అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సాంకేతిక సమస్యలను పరిష్కరించి, అర్హులైన రైతులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అన్నదాతలు రోడ్డెక్కే పరిస్థితి రావడం ప్రభుత్వ వ్యవస్థకు పెద్ద హెచ్చరికగా భావిస్తున్నారు.

Read Also: గుడ్ న్యూస్.. తెలంగాణకు మరో రెండు కొత్త ఎయిర్ పోర్టులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>