కలం, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లాలో ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల (Chityala Road Accident ) మండలం పెద్దకాపర్తి దగ్గర కారును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనలో తీవ్ర గాయలపాలైన కారు డ్రైవర్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

