చేపల వేటకు వెళ్లి.. సముద్రంలో మత్స్యకారుల గల్లంతు!

కలం, వెబ్ డెస్క్ : చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నెల 1వ తేదీన విశాఖ (Visakhapatnam) తీరం నుంచి వీరంతా బోటులో వేటకు వెళ్లారు. అయితే, ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పాటు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్‌ రావడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

గల్లంతైన వారిని అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్న అమ్మోరు, కారి చిన్న, చిన్నయ్యగా గుర్తించారు. వీరిలో ఆరుగురు భోగాపురం ముక్కాం ప్రాంతానికి చెందినవారు కాగా, మరొకరు భీమిలికి చెందినవాసిగా సమాచారం. మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన నేవీ, మెరైన్ పోలీస్, కోస్ట్‌గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అత్యాధునిక బోట్లు, హెలికాప్టర్ల సాయంతో సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

Read Also: అల్లూరి జిల్లాలో వర్ష బీభత్సం.. 20 గ్రామాలకు రాకపోకలు బంద్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>