ఆడపిల్లలు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: జడ్జి శ్రీవాణి

కలం, నిర్మల్: ఆడపిల్లలు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి (Judge Srivani) సూచించారు. నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయుల అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లల సంరక్షణ చట్టం, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) వంటి చట్టాల ప్రాముఖ్యతను వివరించారు.

బాలికల భద్రత, హక్కుల పరిరక్షణలో ఈ చట్టాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక బాధ్యత వహించాలని సూచించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే తమ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆమె (Judge Srivani) అన్నారు. సమాజంలో మహిళల భద్రత, సాధికారతకు చట్టాలపై అవగాహనతో పాటు నైతిక విలువలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, డీఈఓ భోజన్న తదితరులు పాల్గొన్నారు.

Also Read : రక్షకుడే రాక్షసుడిగా మారితే.. SI అరెస్ట్ వెనుక అసలు నిజాలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>