Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) తనదైన పాలనతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ(Loan Waiver) చేస్తున్నట్లుగా ప్రకటించారు. 2025 మే 1 నుండి 2026 ఫిబ్రవరి 28 మధ్య కాలంలో సహకార బ్యాంకుల ద్వారా పంటల రుణాలు పొందిన అన్నదాతలకు ఈ పథకం వర్తిస్తుందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త పథకం ద్వారా .. భూమి ఎంత ఉందనే దానితో సంబంధం లేకుండా అర్హులైన రైతులందరికీ రూ.75,000 వరకు పంట రుణాలు మాఫీ కానున్నాయి.

అయితే ఒకవేళ రుణం మొత్తం రూ.75,000 కంటే ఎక్కువగా ఉంటే , వారికి రూ.35,000 వరకు రుణాన్ని మాఫీ చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14.43 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని వెల్లడించింది. దీనికోసం ప్రభుత్వం రూ. 5,932.23 కోట్ల ఖర్చును భరించనుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) తాజా నిర్ణయంపై అక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: సీఎం విజయ్‌కు విశాల్ వినూత్న కానుక.. నెటిజన్స్ హ్యాట్సాఫ్!

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>