కలం, వెబ్‌డెస్క్: ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఓ ఆర్డీసీ డ్రైవర్ (RTC Driver) కు ఉన్నతాధికారులు షాకిచ్చారు. ఏకంగా ఉద్యోగంలో నుంచి తొలగించేశారు. చిత్తూరు (Chittoor) జిల్లాలోని పలమనేరులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గణేష్ కుమార్ ఆర్టీసీలో హైర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల పలమనేరు-మదనపల్లె మార్గంలో ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేశాడు. గణేష్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తుండగా ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు పంపించాడు.
ఈ వీడియో మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పలమనేరు డిపో మేనేజర్ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ డ్రైవర్లు విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని, ప్రయాణికుల రక్షణను దృష్టిలో పెట్టుకొని బాధ్యతతో ఉండాలని అధికారులు సూచించారు.
ఫోన్ చూస్తూ ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్‌పై వేటు!
-పలమనేరు – మదనపల్లె మార్గంలో సెల్‌ఫోన్ చూస్తూ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గణేష్ కుమార్ డ్రైవింగ్
-వీడియో తీసి ఆర్టీసీ అధికారులకు పంపిన ఓ ప్రయాణికుడు
-మంత్రి దృష్టికి వెళ్లిన ఈ విషయం.. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు… pic.twitter.com/B9RuCXDyoE— Kalam Daily (@kalamtelugu) August 1, 2026
Also Read : ‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం
Follow Us On : WhatsApp

