epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నదిన్​ డిక్లెర్క్​ ఆల్​రౌండ్ షో.. ఆర్​సీబీ గెలుపు బోణీ

కలం, వెబ్​డెస్క్​: మహిళల ప్రీమియర్​ లీగ్ (డబ్ల్యూపీఎల్​)లో​ నాలుగో సీజన్​కు అదిరే ఆరంభం. శుక్రవారం ముంబైలోని డీవై పాటిల్​ స్టేడియం వేదికగా మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ​(RCB Vs MI) లో ఆర్​సీబీ గెలుపు బోణీ కొట్టింది. ఆఖరి ఓవర్​ చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్​లో ఆర్​సీబీ ఆల్​రౌండర్​ నదిన్​ డిక్లెర్క్(63 నాటౌట్​; 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్​లు; 4/26) ​ తన జట్టుకు విజయం సాధించి పెట్టింది. ఆఖరి ఓవర్లో విజయానికి 18 పరుగులు అవసరం కాగా చివరి నాలుగు బంతులను సిక్స్​, ఫోర్​, సిక్స్​, ఫోర్​గా మలచి చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

ఈ మ్యాచ్​ (RCB Vs MI) లో టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​ చేసిన ముంబై ఇండియన్స్​ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సజీవన్​ సజన (45; 25 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్​) టాప్​ స్కోరర్​. నికోలా కేరీ(40; 29 బంతుల్లో 4 ఫోర్లు), కమలిని(32;28 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్​ హర్మన్​ ప్రీత్​(20; 17 బంతుల్లో 1 ఫోర్​, 1 సిక్స్​) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఆర్​సీబీ బౌలర్​ నదిన్​ డిక్లెర్క్​ 4 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక పాటిల్​, లారెన్​ బెల్​ చెరో వికెట్​ తీశారు. ఛేదనలో ఆర్​సీబీ తడబడింది. 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కెప్టెన్​ మంధాన (18) నిరాశ పర్చింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటరి పోరాటం చేసిన నదిన్ డిక్లెర్క్(Nadine De Klerk )​ ఆఖరి ఓవర్​లో 18 పరుగులు అవసరంగా కాగా, రెండు సిక్స్​లు, రెండు ఫోర్లు కొట్టి తన జట్టుకు 3 వికెట్ల తేడాతో(157/7) విజయాన్ని అందించింది. ఆల్​రౌండ్​ షో కనబర్చిన నదిన్​ డిక్లెర్క్​కే ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ లభించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>