epaper
Tuesday, November 18, 2025
epaper

రుషికొండ భవనాలను ఎలా వాడదాం.. సూచనలు అడిగిన ప్రభుత్వం

వైసీపీ ప్రభుత్వం రుషికొండ(Rushikonda)లో నిర్మించిన విలాసవంతమైన భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ భవనాలను ఎలా వినియోగించాలి అనే అంశంపై ప్రజల నుంచి సూచనలు కోరింది. ఈ మేరకు పర్యాటక శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ ప్రకటనను టూరిజం అథారిటీ సీఈఓ ఆమ్రపాలీ ప్రకటనను విడుదల చేశారు. ప్రజలు తమ సూచనలను rushikonda@aptdc.in కి పంపాలని ఆమె వివరించారు. ఈ నెల 17న జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

పౌరులు, సంస్థల సూచనలపై మంత్రుల బృందం సమీక్షిస్తుందని చెప్పారు. ఆ సంస్థల నుంచి కొన్ని సూచనలు తీసుకోనున్నామని, వాటిని ప్రజలు ఇచ్చిన సూచనలను మంత్రుల బృందం సమీక్షిస్తుందని చెప్పారు. ఆ సమీక్ష తర్వాత రుషికొండ(Rushikonda) భవనాల వినియోగంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

Read Also: హీరోయిన్లకు మర్యాద ఇవ్వరన్న పూజా.. ఎందుకో మరి..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>