కలం, వెబ్ డెస్క్ : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి (Rangaswamy) తిరిగి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్డీయే కూటమి పక్షనేతగా ఎన్. రంగస్వామి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఎన్నిక జరిగింది. మొత్తం 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16. అయితే ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. పోటీ చేసిన 16 స్థానాల్లో 12 చోట్ల విజయం సాధించి ఏఐఎన్ఆర్సీ (AINRC)అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో గెలిచింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కూటమికి మద్దతు తెలిపారు.
Read Also: ‘విజయ్ అనే నేను..’ రేపే సీఎంగా ప్రమాణ స్వీకారం
Follow Us On: WhatsApp

