కలం, వెబ్ డెస్క్: ‘‘మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఉంటాం.. ఢిల్లీలో విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తాం. రాజ్యసభలో MANUU భూములపై మాట్లాడతాం’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గతంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల భూమిని తీసుకున్నారని అన్నారు. HCUలో 400 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారని, అందులో 10 వేల కోట్ల కుంభకోణం ఉందని నిర్ధారణ అయితే, బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని కేటీఆర్ గుర్తుచేశారు. ఆనాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద చర్య తీసుకొని ఉంటే, ఉర్దూ యూనివర్సిటీ భూములు కబ్జాకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టేది కాదని కేటీఆర్ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చారని, వాళ్ల దగ్గర కూడా 100 ఎకరాలు లాక్కోవాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
రెండేళ్లు గడిచినా ప్రభుత్వం 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, రెండు లక్షల ఉద్యోగాలు ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. పిల్లలు రోడ్డు ఎక్కితే పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారని, రేవంత్ రెడ్డి (Revanth Reddy) షాపింగ్ మాల్ ఓపెనింగ్ పోతున్నాడని భయంతో అరెస్టులు మీద అరెస్టులు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

Read Also: ‘క్యూర్, ప్యూర్’ పైనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp


