Mobile Popup Ad
Mobile Popup Ad

సౌత్​ వర్సెస్​ నార్త్​.. ‘ఢీ’ లిమిటేషన్

కలం, తెలంగాణ బ్యూరో: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation).. దశాబ్దాలుగా పొలిటికల్ పార్టీల్లో ఇదో డిబేట్! ఇందిరాగాంధీ హయాంలో జరిగింది. ఆ తర్వాత దాని ఊసే లేదు. మధ్యలో ఓసారి జరిగినా కేవలం హద్దుల మార్పు వరకే. ఇప్పుడు తప్పక చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఇందుకోసం ప్రాసెస్ కూడా రెడీ చేసింది. దానిపై రాష్ట్రాలూ స్పందించాయి. కానీ, అనుసరించే విధానంపైనే అనుమానాలు. డీలిమిటేషన్ ఫార్ములాపై ఇప్పటికీ క్లారిటీ లేదు. సౌత్‌కు నష్టం జరిగేలా కేంద్రం చర్యలు ఉన్నాయన్నది తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల వాదన. ఇందుకోసం సౌత్ స్టేట్స్ నేతలు ఒక్కటవుతున్నారు. పలు ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నారు. వాటి ప్రకారం డీలిమిటేషన్ చేపడితేనే దక్షిణాదికి న్యాయం జరుగుతుందంటున్నారు. గతంలో చేపట్టినట్టు జనాభా ప్రాతిపదికన చేయాలని కేంద్రం చూస్తున్నదని.. అలా చేస్తే కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల సీట్లు సరిపోతాయని, దీని వల్ల సౌత్‌కు తీరని అన్యాయం జరుగుతుందని ఇక్కడి నేతల ఆందోళన. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సౌత్‌పై ఎప్పుడూ చిన్న చూపే ఉంటున్నదని.. ఇప్పుడు దాన్ని మరింత పెంచేలా కేంద్రం తీరు కనిపిస్తున్నదని మండిపడుతున్నారు.

అసలు డీలిమిటేషన్ చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో ఎప్పుడు జరిగింది? అనుసరించిన విధానమేంటి? తెరమీదికి వస్తున్న ‘కుటుంబ నియంత్రణ’ అంశం వెనుక అసలు వాస్తవం ఏమిటి? సౌత్ రాష్ట్రాల వాదనలో ఉన్న బలమెంత? కేంద్రం మనసులో డీలిమిటేషన్‌ ఫార్ములా ఏంటి? దాని ఆలోచనేంటి? దక్షిణాది నేతలు అనుమానిస్తున్నట్లు జరిగితే.. జరిగే నష్టం ఏమిటి?, ఎవరికి?.. వీటిపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Delimitation
Delimitation

Read Also: ఏది ఏమైనా ప్రభుత్వ ప్రాధాన్యత విద్య, వైద్యం: CM రేవంత్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>