Mobile Popup Ad
Mobile Popup Ad

ఫుట్‌బోర్డ్ ప్రమాదాలకు గుడ్​బై.. క్లోజ్డ్ డోర్ నాన్ ఏసీ రైలు వచ్చేస్తోంది!

కలం, వెబ్​ డెస్క్​: ముంబై (Mumbai) సబర్బన్ రైల్వే ప్రయాణికుల రక్షణ కోసం రూపొందించిన మొట్టమొదటి నాన్-ఏసీ ఆటోమేటిక్ డోర్ క్లోజర్ రైలు అందుబాటులోకి రానుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ 12 కోచ్‌ల రైలు ప్రస్తుతం కుర్లా కార్ షెడ్‌లో ఉంది. గతేడాది ముంబ్రా సమీపంలో రద్దీగా ఉన్న రైలు ఫుట్‌బోర్డు నుంచి పడి ఐదుగురు ప్రయాణికులు మరణించారు. ఈ క్రమంలో రైల్వే బోర్డు ఈ తరహా క్లోజ్డ్ డోర్ (Door Closure Train) నాన్-ఏసీ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. గత పదేళ్లలో వేలాది మంది ప్రయాణికులు రైలు నుంచి కింద పడి మరణించిన నేపథ్యంలో రైళ్లలో ఆటోమేటిక్ తలుపులను ఏర్పాటు చేయాలని భావించింది.

ఈ కొత్త రైలులో ప్రయాణికుల సౌకర్యం భద్రత కోసం అత్యాధునిక ఫీచర్ల కూడా ఉన్నాయి. కిటికీల పరిమాణాన్ని పెంచడంతోపాటు, గాలి వెలుతురు కోసం తలుపులకు ‘లూవ్రేస్’ (ప్రత్యేక రంధ్రాలు) పైకప్పుపై వెంటిలేషన్ యూనిట్లను అమర్చింది. దీనివల్ల తలుపులు మూసి ఉన్నప్పటికీ కోచ్ లోపల ఉక్కపోత కలగకుండా గాలి అందుతుంది. అలాగే రైలు కదులుతున్నప్పుడు తలుపులు తీయడానికి వీలులేని విధంగా ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ కూడా ఉంది. అత్యవసర సమయాల్లో డ్రైవర్‌తో మాట్లాడేందుకు టాక్-బ్యాక్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తున్న ఈ రైలు అన్ని పరీక్షలు పూర్తి చేసుకుంది. మూడు నెలల తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

Read Also: సింగర్ మంగ్లీ వెనుక KTR.. మాజీ మంత్రి రియాక్షన్ ఇదే

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>