Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహా అపచారం.. భారీగా మద్యం సీజ్

కలం, వెబ్ డెస్క్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం (Srisailam) లో భారీ స్థాయిలో మద్యం అక్రమ రవాణా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఆలయ ప్రాంత పవిత్రతకు భంగం కలిగించే ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో ఆర్టీసీ బస్టాండ్, సిద్ధరామప్ప కాంప్లెక్స్ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 314 క్వాటర్ బాటిళ్లు, సుమారు 24 లీటర్ల నాటుసారను పోలీసులు సీజ్ చేశారు.

ఈ ఘటనలో ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఆత్మకూరు నుండి శ్రీశైలం(Srisailam) కు మద్యం తరలించి, అక్కడి హోటళ్లలో పనిచేసే కార్మికులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పవిత్ర క్షేత్రంలో మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ, ఈ విధంగా అక్రమంగా సరఫరా జరగడం పై అధికారులు తీవ్రంగా స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Read Also: సింగర్ మంగ్లీ వెనుక KTR.. మాజీ మంత్రి రియాక్షన్ ఇదే

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>