ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు అమలు చేయాలి: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: కనీసం అంబేద్కర్‌కు దండ కూడా వేయని సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి (CM Revanth) అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాలను రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకాని హామీలు ఇచ్చి.. నేడు ఏమిచేయలేక చేతులు ముడుచుకుని కూర్చుందని దుయ్యబట్టారు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికి డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ 135 వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తడకపల్లిలో అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని.. దీంతో ఎన్నో ఎళ్లుగా ఉన్న లోటు నేటితో తీరిపోయిందని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తిని రగిలించే విధంగా గ్రామంలో ఆయన జయంతి రోజున విగ్రహాం ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషకరమని తెలిపారు.

అంబేద్కర్ అందరివాడు..

కొంతమంది అనుకున్నట్లు అంబేద్కర్ (Ambedkar) కేవలం ఒక వర్గానికి మాత్రమే నాయకుడు కాదని.. ఆయన అందరివాడు అని కొనియాడారు. కొంతమంది కావాలనే ఆయన్ను ఒక వర్గానికి ఆపాదించే కుట్రచేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ ప్రపంచంలో అదిపెద్ద ప్రజా స్వామ్య దేశంగా భారతదేశం ఎదుగుతుంది అంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తి అని పేర్కొన్నారు. అమెరికా లాంటి దేశంలోనే మహిళలకు ఓటు హక్కు రావాలంటే దశాబ్దాల కాలం పట్టిందని.. కానీ మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే రాజ్యాంగం ద్వారా ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి బాబాసాహేబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేటి యువత అంబేద్కర్ నుస్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.పేదరికం అనేది చదవుకోవడానికి అడ్డు రాకూడదని అంబేద్కర్ ని చూసి నేర్చుకోవాలని చెప్పారు. దేశంలోని అణగారిన వర్గాల కోసం పోరాడి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు.

భారీ విగ్రహాని రేవంత్ తాళం వేయించాడు..

హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. ‘చదవుకున్న పిల్లలకు 10వ తరగతి పాస్ అయితే రూ.10వేలు, ఇంటర్ పాస్ అయితే రూ.25 వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.1లక్ష, పీజీ పాస్ అయితే రూ.2 లక్షలు ఇస్తామని చెప్పి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను నమ్మించి మోసం చేశారు. ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు రాకా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే..సచివాలయానికి అంబేద్కర్ పేరుపెట్టిన ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున్నకేసీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాం ఏర్పాటు చేస్తే.. ఇది కేసీఆర్ పెట్టించిండు అని రేవంత్ రెడ్డి దానికి తాళం వేయించాడు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు, వ్యసనాలకు బానిసలు కాకుండా.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో ముందుకు సాగండి’ అని పిలుపునిచ్చారు.

Read Also: 70 కోట్ల మంది మహిళల జీవితాలతో ఆటలాడుతోంది.. బీజేపీపై కవిత ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>