Mobile Popup Ad
Mobile Popup Ad

‘పీర్ల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించండి’

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: కులమతాలకు అతీతంగా నిర్వహించుకొనే మొహర్రం (పీర్ల‌పండుగ)ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని పీర్ల పండుగ (Muharram) రాష్ట్ర సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రం‌లోని ఆర్‌అండ్‌బీ, గెస్ట్‌హౌస్ ఆవరణ‌లోని మహబూబియా హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. పీర్ల పండుగ రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టన్న, రాష్ట్ర ప్రతినిధులు మహ్మద్ ఖలీల్, మహ్మద్ సాధిఖ్, జిల్లా ప్రతినిధి మహ్మద్ ముజీబ్ ప్రభుత్వానికి కోరారు.

తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించడంలో పీర్లపండుగ (Muharram) ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో, బతుకమ్మ‌తోపాటు పీర్లను కూడా ప్రదర్శించామని గుర్తు చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, పద్ధతుల ద్వారా తెలంగాణ సాకారం అయిందని సంఘం అభిప్రాయ పడింది. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పీర్ల చావిడిలు, అషూర్ ఖానాలు, పీర్ల మసీద్ నిర్వాహకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని సమావేశం అభిప్రాయపడింది. అనంతరం సంఘం సభ్యులు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఒబేదుల్లా కొత్వాల్‌ను కలిసి పీర్ల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా పీర్ల సంఘం ప్రతినిధులు చావుష్, హన్మంతు, పల్లె చుక్కప్ప, అంజప్ప, జలాల్ పాషా, చాంద్ పాషా, మహ్మద్ అలీ, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: సిలికాన్​ వ్యాలీ హైదరాబాద్​ తో పోటీ పడుతోంది : సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>