సిలికాన్​ వ్యాలీతో హైదరాబాద్​ పోటీ పడుతోంది : సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్​ : అమెరికాలోని సిలికాన్​ వ్యాలీతో హైదరాబాద్​ పోటీ పడుతోందని సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలో అత్యధికంగా ఐటీ ఎగుమతులు సైబరాబాద్​ నుంచే ఎగుమతి అవుతన్నాయని ఆయన తెలిపారు. శేరిలింగంపల్లితో పాటు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 1674.74 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలు అనేక సమస్యల్లో కొట్టిమిట్టాడుతున్నాయన్నారు. హైదరాబాద్​ నగరానికి అలాంటి ఇబ్బందులు రాకూడదనే తెలంగాణ రైజింగ్ 2047 ద్వారా నగరాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నిపుణుల సూచనలతో క్యూర్​ ప్రాంతాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించామన్నారు.

డిల్లీ, ముంబై, బెంగుళూరు, కలకత్తా, చెన్నై, హైదరాబాద్ ఈ ఆరు నగరాలే దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోందన్నారు. ఒక పద్దతి ప్రకారం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికే మహా నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించామని గుర్తు చేశారు. జెండాలకు ఎజెండాలకు అతీతంగా మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం అని పిలుపునిచ్చారు. పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు.. కేంద్ర మంత్రిగాకిషన్ రెడ్డి ఉన్నా.. ప్రధాని మోదీని ఎందుకు నిధులు అడగడం లేదు? అని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

మోదీ గుజరాత్ లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకుంటే ఆహా ఓహో అంటున్నవారు.. మూసీని అభివృద్ధి చేస్తామంటే అడ్డుకుంటున్నారని సీఎం దుయ్యబట్టారు. పదేళ్ల కెసీఆర్ పాలన, పన్నెండేళ్ల మోదీ పాలన, 30 నెలల తమ పాలనపై చర్చకు సిద్ధం అని సవాల్​ విసిరారు. త్వరలో గాజుల రామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ నిర్మించబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. విశ్వనగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు.. అందుకు అనుగుణంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. అందుకే మెట్రో రెండో దశ విస్తరణ చేపడుతున్నామని వెల్లడించారు. హైదరాబాద్​ నగరంలో LIG, MIG ఇండ్లను కట్టి పేదల కష్టాలు తీరుస్తామని కీలక ప్రకటన చేశారు. కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను విడిపించి అక్కడ పేదలకు ఇండ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు నిధులు రాకుండా, అభివృద్ధి జరగకుండా కిషన్​ రెడ్డి కాళ్లలో కట్టెలు పెడుతున్నాడని విమర్శించారు.

Read Also: సిరిసిల్ల ఇసుక మాఫియాపై CID పంజా.. ఆ నేతల్లో అలజడి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>