కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad)లో ఊర కుక్కల మృతి పంచాయితీ పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. కుక్కలను చంపించినందుకు గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామాభివృద్ధి కమిటీలోని మొత్తం 16 మందిపై కేసు నమోదైంది. గ్రామస్తుల ఫిర్యాదుతోనే సర్పంచ్ ఈ కుక్కలను చంపించినట్లు సమాచారం. మొగ్పాల్ (Mugpal)లో ఇటీవల కుక్కల దాడులు పెరిగిపోయాయి. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ ప్రజలపై దాడి చేస్తున్న పిచ్చి కుక్కలను చంపేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఇంజక్షన్ ద్వారా విషం ఇచ్చి 16 కుక్కలను చంపినట్లు తెలిసింది. అయితే మృతి చెందిన కుక్కల్లో స్థానిక ఎస్సై సుస్మిత (SI Sushmitha) పెంపుడు కుక్క కూడా ఉండటం గమనార్హం.
దీంతో ఆమె సర్పంచ్, ఉప సర్పంచ్, వీడీసీ సభ్యులు సహా మొత్తం 16 మందిపై తాను పని చేస్తున్న పోలీసు స్టేషన్లోనే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు అయింది. ఈ విషయమై నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ భిక్షపతి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా విచారణ ప్రారంభించారు. మోపాల్‌లో పిచ్చికుక్కలను హతమార్చారని.. ఎస్సై పెంపుడు కుక్కను సైతం చంపారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ భిక్షపతి తెలిపారు.

