రష్యాపై ఉక్రెయిన్​ భీకర డ్రోన్​ దాడులు.. వీడియోలు వైరల్​

కలం, వెబ్​ డెస్క్​: ఉక్రెయిన్​ మరోసారి రష్యాపై దాడులకు దిగింది. శుక్రవారం రష్యాలోని సమారా ప్రాంతంలోని నోవోకుయ్‌బిషెవ్‌స్క్ ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్​ దాడులకు (Ukraine Drone Attack) పాల్పడింది. అటాక్​ లో రోస్‌నెఫ్ట్ సంస్థకు చెందిన రిఫైనరీలో పలు చోట్ల మంటలు చెలరేగి, భారీ పొగలు అలుముకున్నాయి. దాడులకు సంబంధించి స్థానికులు తీసిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ గా మారాయి.

రెండు వారాలుగా దాడులను నిలిపివేసిన ఉక్రెయిన్​ తిరిగి మళ్లీ శుక్రవారం దాడులకు దిగింది. అంతర్జాతీయ మీడియా కథనాల ఆధారంగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి కారణంగా ఉక్రెయిన్ దాడులను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే అక్టోబర్ 29న డ్నిప్రో రైల్వే స్టేషన్‌లో రష్యా డ్రోన్ దాడిలో 14 మంది పౌరులు మరణించారు. ఈ దాడి తరువాత ఉక్రెయిన్​ రష్యాలోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్​ దాడులకు (Ukraine Drone Attack) పాల్పడింది. కాగా, ఈ రిఫైనరీలో జెట్ ఫ్యూయల్‌తో సహా సైనిక అవసరాలకు ఉపయోగపడే ఉత్పత్తులు తయారు చేస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>