కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగార్థులకు తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అన్ని రిక్రూట్మెంట్ బోర్డుల పరిధిలో ప్రభుత్వ సర్వీసుల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితిని పెంచుతూ విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి గరిష్ఠ వయోపరిమితిని 5 సంవత్సరాలు పెంచుతూ సీఎం విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సీఎం విజయ్ (CM Vijay) ప్రకటించిన ఈ నిర్ణయం ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. నియామకాలలో జాప్యం కారణంగా వయోపరిమితి వల్ల అనర్హతకు గురైన అభ్యర్థుల దీర్ఘకాల డిమాండ్ల ఆధారంగా రాష్ట్ర (Tamil Nadu) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, నిరుపేద వితంతు అభ్యర్థులకు ఇప్పటికే ఉన్న వయో సడలింపులకు అదనంగా ఈ ఐదేళ్ల పెంపు ఉంటుంది.
Also Read : సౌరవ్ దాస్‌కు మద్రాస్ హై కోర్టు నోటీసులు
Follow Us On : WhatsApp

