కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా కమ్మెటలోని ఎల్జీ ఫాంహౌస్‌పై చేవెళ్ల పోలీసులు (Chevella Police) దాడులు చేశారు. అనుమతులు లేకుండా ఇక్కడ పార్టీ జరుగుతోందనే సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. సుమారు 80 ఐసీఎఫ్ఐ విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు ఏమైనా తీసుకుంటున్నారా.. అనేది చెక్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 47 ఫాంహౌస్‌ల్లో పోలీసులు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఫాంహౌస్‌ల కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు జరగడంతో పాటు మత్తు పదార్థాల వినియోగం కూడా జరుగుతోందనే సమాచారంతో తరచూ సోదాలు చేస్తున్నారు. తాజాగా, మరోసారి ఇలాంటి దాడులు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : మాజీ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
Follow Us On : WhatsApp

