పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు

కలం, బాసర: బాసర (Basara) మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao Patel) హాజరయ్యారు. ఈ సందర్బంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వ్యవసాయం, విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ తదితర శాఖలకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ, వీఓ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>