రాజీనామా చేసేవరకు వదలబోం: అభిజిత్ దీప్కే

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసేవరకు వదలబోమని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్క్ (Abhijeet Dipke) స్పష్టం చేశారు. రేపు ముంబయిలోని శివాజీ పార్క్ కేంద్రంగా ఆందోళనలు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఆయన రాజీనామా చేసి ఊరుకుంటే సరిపోదని.. క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ కూడా చేయాలన్నారు.

ఇక నుంచి జరిపే ఎన్నికలను 2025 ఓటర్ల జాబితా ప్రకారమే నిర్వహించాలని అభిజిత్ దీప్క్ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంలో వెంటనే సంస్కరణలు అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికలక కమిషనర్ సహా ఇద్దరు ఎన్నికల కమిషనర్లపై కేంద్రం నియంత్రణ, ప్రభావం లేకుండా చూడాలన్నారు. “జ్ఞానేష్ కుమార్ దేశద్రోహీ. సీఈసీగా ఉండే అర్హత ఏమాత్రం లేదు. మోదీ, అమిత్ షా చెప్పినట్లు ఆడే ఆట బొమ్మ ఆయన” అంటూ విమర్శలు గుప్పించారు.

పలు రాష్ట్రాల్లో ఆందోళనలు..

దేశంలో నియంతల పాలన సాగుతోందని అభిజిత్ దీప్కే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆందోళనలు చేస్తే బెయిల్ కూడా దొరకకుండా చేస్తామని బెదిరిస్తున్నారని.. ఇలాంటి వాటికి భయపడబోమన్నారు. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్, బీహార్, యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఇక నుంచి ఆందోళనలు చేస్తామన్నారు. అక్టోబర్ నెలాఖరులో జంతర్ మంతర్ వద్ద భారీ ఉద్యమం చేపడుతామన్నారు. తాము నిరసనలు చేస్తామంటే ప్రభుత్వం అనుమతించదన్న విషయం తమకు తెలుసని.. అలా అని ఊరుకుంటే మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చేవారా.. అని ప్రశ్నించారు. బ్రిటీష్ నిర్బంధాలను ఎదుర్కొని గాంధీజీ స్వాతంత్య్రం తెచ్చారని.. తాము అదే సిద్ధాంతం ఫాలో అవుతామన్నారు. దేశమంతా జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తోందని మరోసారి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>