నిర్మల్ బీజేపీ ఆఫీస్‌లో ‘సేవా సంకల్ప అభియాన్‌’

కలం, నిర్మల్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా నిర్మల్‌ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ గోడెం నగేష్ (MP Godam Nagesh) గురువారం మొక్కలు నాటారు. అనంత‌రం ఎంపీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, కౌన్సిలర్ సూరజ్ నాయక్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, నాయకులు అర్జున్, హరీష్, కుమ్మరి వెంకటేష్, పూదరి రంజిత్‌, విజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>