Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ స్కామ్ తో నాకు సంబంధం లేదు.. సింగర్ మంగ్లీ క్లారిటీ

కలం, వెబ్ డెస్క్ : సింగర్ మంగ్లీ (Singer Mangli) పేరు మరో వివాదంలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సింగర్ మంగ్లీ పేరుతో కొందరు అధిక వడ్డీ ఆశ చూపించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. సదరు బాధితులు కేసు పెట్టగా.. లాయర్ ఈ విషయంపై ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. దాదాపు రూ.150 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కామ్ జరిగిందని.. ఈ కేసులో సింగర్ మంగ్లీ తమ్ముడు శివ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాటిపై తాజాగా మంగ్లీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

‘మైక్రో ఫైనాన్స్ పేరిట నా పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు ఆ వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదు. పా ప్రొఫైల్ ఈవెంట్స్ కోసం రోజూ చాలా మంది నన్ను, నా తమ్ముడిని కలుస్తుంటారు. అంతే తప్ప నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. కేవలం ఈవెంట్లు మాత్రమే నిర్వహిస్తున్నాను. కావాలనే కొందరు నా వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా నా పేరును ఇలాంటి కేసుల్లోకి లాగుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఆ వ్యాపారాలతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధాలు లేవు. నా పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారంటే అస్సలు నమ్మొద్దు. అలాంటి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు వారిని కోరుతున్నాను‘ అని మంగ్లీ (Singer Mangli) చెప్పారు.

Read Also: AI సాయంతో 26 కిలోల బరువు తగ్గిన వ్యక్తి.. ఎలా అంటే..?

Follow Us On: Sharechat

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>