కలం, మెదక్ బ్యూరో : కమర్షియల్ గా అమ్మేస్థాయిలో తేనెటీగల పెంపకం (Beekeeping) యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రోత్సహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య (Collector Pravinya) అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ, ఉద్యానవన, డీఆర్‌డీఏ శాఖల అధికారులతో జిల్లాలో అమలవుతున్న తేనెటీగల పెంపకం, వ్యవసాయ యాంత్రీకరణ, వర్షాదార ప్రాంతాల అభివృద్ధి, కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో తేనెటీగల పెంపకం (Beekeeping) కార్యక్రమాన్ని మరింత విస్తరించాలని, ఎక్కువ మంది రైతులకు బీహైవ్ యూనిట్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా తేనెటీగల పెంపకం, వ్యవసాయ ఉత్పాదకతలో గణనీయమైన వృద్ధి సాధించేందుకు వ్యవసాయ యాంత్రీకరణ, వర్షాధార ప్రాంతాల అభివృద్ధి (RAD) పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన వ్యవసాయ యాంత్రీకరణ లక్ష్యాలను వేగంగా సాధించాలని ఇప్పటివరకు లబ్దిపొందిన వారిని పరిశీలించి, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (UCs) వెంటనే సమర్పించాలన్నారు.
మారుతున్న కాలానికి , కొత్తగా వస్తున్న టెక్నాలజికి అనుగుణంగా రైతులను యాంత్రీకరణ వైపు మరింతగా ప్రోత్సహించాలని సూచించాలి. ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా మినీ ట్రాక్టర్లు, పవర్ వీడర్స్, పవర్ టిల్లర్స్, బ్రష్ కట్టర్స్, పవర్ స్ప్రేయర్స్ వంటి యంత్రాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 97 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో డీఆర్డీఏ ఏపీడీ సూర్యరావు, ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, తదితరులు పాల్గొన్నారు.
Read Also: నక్షత్ర నిశీధిని కనుమరుగు చేస్తున్న శాటిలైట్లు!
Follow Us On: Facebook

