కలం, వరంగల్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. భారీ ఎండలకు ప్రతిఒక్కరూ భయపడిపోతున్నారు. ముఖ్యంగా వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు ఎండల బారిన పడుతూ వడదెబ్బకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమకొండ (Hanamkonda) ట్రాఫిక్ పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలో బుధవారం అశోకా జంక్షన్ సిగ్నల్ వద్ద వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రక్షణ చర్యలు చేపట్టారు. సిగ్నల్ వద్ద వేచి ఉండే వాహనదారుల కోసం గ్రీన్ మ్యాట్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్యలపై జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఆర్టీసీ లాభాల్లో అంటూ బోగస్ ప్రచారం: హరీష్ రావు
Follow Us On: Sharechat

