Mobile Popup Ad
Mobile Popup Ad

గవర్నమెంట్​ జాబ్​ కంటే మిర్చి బండి బెటర్ : ఎంపీ రఘునందన్​ రావు

కలం, వెబ్​ డెస్క్​ : నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా.. చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలని మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు (MP Raghunandan Rao) సూచించారు. శనివారం వరంగల్​ లో పర్యటించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగుల కంటే మిర్చిబండి పెట్టుకున్నవారు ఎక్కువగా సంపాదించవచ్చని తెలిపారు.

గవర్నమెంట్​ జాబ్ కంటే స్వయం ఉపాధి ద్వారా లక్షలు సంపాదించవచ్చని.. హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపారాలైన పానీపూరి, గోకుల్ చాట్ కౌంటర్ ద్వారా రోజుకి లక్ష రూపాయల ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు. బజ్జీల బండి పెట్టుకోవడం కూడా ఒక ఉద్యోగమా? అని అంటున్నారని.. ఏ ఉద్యోగం లేకపోవడం కంటే స్వయంగా ఉపాధి పొందడం మంచిదేకదా అని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>