కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రియాక్షన్

కలం, వెబ్ డెస్క్: కవిత (Kavitha) కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని అన్నారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకు వెళ్లిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ తనను సరిగ్గా పట్టించుకోలేదని, ఆ అసంతృప్తితోనే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టిందని మల్లు రవి ఆరోపించారు. రాజకీయ కారణాలతో తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ గురించి ఆమె ఏం మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మాత్రం తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం రామరాజ్యం నడుస్తోందని, ముఖ్యమంత్రిని హిట్లర్ తో పోల్చడం సరికాదని ఆయన (MP Mallu Ravi) హితవు పలికారు.

Read Also: బీజేపీ మూలాలు బెంగాల్ లో ఉన్నాయి: ప్రధాని మోదీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>