Mobile Popup Ad
Mobile Popup Ad

కుక్కల దాడి.. కంటిచూపు కోల్పోయిన బాలుడికి అండగా ఎంపీ చామల

కలం, వెబ్ డెస్క్: వీధి కుక్కల దాడిలో కంటిచూపు కోల్పోయిన బాలుడికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) అండగా నిలిచారు. భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి చిన్నారి ప్రియాంష్ దురదృష్టవశాత్తూ కంటిచూపు కోల్పోయారు. విషయం తెలుసుకున్న చామల.. చిన్నారి పరిస్థితి తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాలుడిని పరామర్శించారు.

చిన్నారి ప్రియాంష్‌కు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, బీబీనగర్ ఎయిమ్స్ ద్వారా మెరుగైన చికిత్స అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుక్కల దాడిలో చిన్నారి కంటి చూపు కోల్పోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.

Read Also: BRS బడా నేతలకు బిగ్ షాకిచ్చిన CM రేవంత్ రెడ్డి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>