కలం/ఖమ్మం బ్యూరో : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala) భద్రాచలం ఆలయ అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. రామభక్తుల చిరకాల వాంఛ భద్రాచల క్షేత్ర అభివృద్ది అతి త్వరలోనే జరుగుతుందన్నారు. భద్రాచలంలో సీత రామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు మంత్రి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం భద్రాచల పట్టణం, దేవస్థానం అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.351 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. శ్రీరామనవమి రోజు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ, శంకుస్థాపన చేశారని.. ఇక మీద పనులు ముమ్మరంగా జరుగుతాయని తెలిపారు.
గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala) వెల్లడించారు. భద్రాచలంలోని పుష్కర ఘాట్లు, రహదారుల విస్తరణతో పాటు సమగ్ర పట్టణాభివృద్ధికి నిధులు సీఎం రేవంత్ రెడ్డి కేటాయించినట్టు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు, రైతులకు సీతారామచంద్రస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
Read Also: మందుబాబులకు సమ్మర్ షాక్.. లిక్కర్, బీర్ ధరలు హైక్ !
Follow Us On: X(Twitter)

