Mobile Popup Ad
Mobile Popup Ad

స్వంతంత్ర భార‌త్‌లో అతిపెద్ద ఉద్య‌మం అమ‌రావ‌తి రైతుల‌దే: మంత్రి అనిత‌

క‌లం, వెబ్ డెస్క్‌: దేశంలో స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన అతి పెద్ద ఉద్య‌మం అమ‌రావ‌తి (Amaravati) రైతుల‌దేన‌ని హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత (Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ ఏపీ అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన తీర్మానంపై అనిత మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని నిర్మాణం కోసం రైతులు, సీఎం చంద్ర‌బాబు ప‌డిన క‌ష్టాన్ని వివ‌రిస్తూ భావోద్వేగానికి గుర‌య్యారు. రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం ల‌భించ‌డంతో ఇక‌ జ‌గ‌న్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమ‌రావ‌తిని అడ్డుకోలేర‌న్నారు. వైసీపీ హ‌యాంలో ఆగిపోయిన రాజ‌ధాని రైతుల పోరాటంతో పునర్నిర్మాణం జరుగుతోందని, చట్టబద్ధతతోనే పెట్టుబడులు, అభివృద్ధి సాధ్యమని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Read Also: మందుబాబులకు సమ్మర్ షాక్.. లిక్కర్, బీర్ ధరలు హైక్ !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>