కేటీఆర్ బూతుల‌కు నాయ‌కుడు: ఎంపీ చామ‌ల

క‌లం, వెబ్ డెస్క్‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌ల‌కు ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran) కౌంట‌ర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి వెళ్లి వ‌చ్చినా త‌న మాట‌లు మార‌లేద‌న్న దానిపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. బూతులకు నాయకుడు ఎవరు అని గూగుల్‌లో కొడితే కేటీఆర్ తండ్రి కేసీఆర్ (KCR) పేరే వస్తుంద‌ని చామ‌ల అన్నారు. గ‌తంలో కేసీఆర్ మాట్లాడిన మాట‌ల‌ను ఒక్క‌సారి యూట్యూబ్‌లో వెతికి చూసుకోవాల‌ని సూచించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) హార్వ‌ర్డ్‌కు వెళ్లినా ఆయ‌న ఎదురుగా మాట్లాడే మ‌నుషుల‌ను బ‌ట్టి మాట్లాడ‌తార‌ని చెప్పారు.

మీ గురించి అర్థం కావాలంటే ప్రజలకు మీ భాషలోనే సమాధానం చెప్తున్నాడ‌ని చెప్పారు. మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో ప్ర‌జ‌లంద‌రూ గ‌మ‌నిస్తున్నార‌న్నారు. అందుకే అసెంబ్లీ, లోక్‌స‌భ‌, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పార‌న్నారు. ఇప్పుడు మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) కోసం కేటీఆర్ చిల్ల‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. కేటీఆర్ కుటుంబం మ‌ళ్లీ ఓట్ల కోస‌మే నాట‌కాలు ఆడుతున్నార‌ని, ఇవ‌న్నీ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌ను ఎంపీ చామ‌ల (MP Chamala Kiran) కోరారు.

Read Also: నాలుగు వారాల్లో కంప్లీట్ చేయండి.. డీజీపీ నియామకంపై ‘సుప్రీం’

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>