epaper
Wednesday, February 18, 2026
epaper

గ్రామ పంచాయతీలకు కేంద్రం గుడ్ న్యూస్

క‌లం, వెబ్ డెస్క్‌: గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభ‌వార్త చెప్పింది. గురువారం 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) నిధులు విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల జాప్యంతో ఈ నిధుల విడుద‌ల నిలిచిపోయింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడం, మంత్రి సీతక్క చొరవ, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతో నిధులు విడుదలయ్యాయి. మొత్తం రూ.3000 కోట్ల వరకు రాష్ట్రానికి రావాల్సి ఉంది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదలయ్యాయి. తొలి విడత నిధులు విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్య‌క్తం చేశారు. మిగతా పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Read Also: ఈ-కామర్స్ ఎగుమతులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>