రామచందర్ రావుకి మీడియాలో కన్పించాలనే తాపత్రయం : ఎంపీ చామల

కలం, నల్లగొండ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) ఏదో ఒక విధంగా మీడియాలో కనిపించాలనే తాపత్రయంతో వ్యవహరిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar) విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోందని అన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందకూడదనే ధోరణి బీజేపీ నేతల్లో కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

గత ప్రభుత్వం యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహాస్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు వినియోగించలేదా అని ప్రశ్నించారు. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్యాత్మిక ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదా అని నిలదీశారు. గంగా, సబర్మతి వంటి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, ఆలయ నిర్మాణాల కోసం ప్రభుత్వ నిధులు వినియోగించిన ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీజేపీ నాయకులు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) వ్యాఖ్యానించారు.

Read Also: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>