ముంబై ఖాతాలో తొలి వికెట్.. ఎలెన్ ఔట్

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 (IPL 2026)లో భాగంగా వాంఖడే మైదానంలో కేకేఆర్ ఓపెనర్లు సృష్టించిన సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. లార్డ్ శార్దూల్ ఠాకూర్ తన మ్యాజిక్‌తో ప్రమాదకరంగా మారుతున్న ఫిన్ అలెన్‌ను పెవిలియన్  పంపి ముంబై ఇండియన్స్‌కు తొలి వికెట్ అందించారు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా ఫిన్ అలెన్ ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. కేవలం 5.2 ఓవర్లలోనే కేకేఆర్ 69 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.

అయితే, ముంబైకి వికెట్ అత్యవసరమైన వేళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బంతిని శార్దూల్ ఠాకూర్‌కు అందించారు. శార్దూల్ వేసిన 117 కిలోమీటర్ల వేగంతో కూడిన స్లోయర్ డెలివరీని భారీ షాట్ ఆడబోయిన ఫిన్ అలెన్, వైడ్ లాంగ్ ఆన్ దిశగా ఉన్న తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ఔట్ కావడానికి ముందు ఫిన్ అలెన్ కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశారు. ఆయన స్ట్రైక్ రేట్ 217.64గా ఉండటం గమనార్హం.

ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ అజింక్య రహానే 28 పరుగులతో ఉండగా, ఆయనకు తోడుగా కేమెరాన్ గ్రీన్ నిలిచారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి కేకేఆర్ ఒక వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. అంతకుముందు బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ (10 పరుగులు), హార్దిక్ పాండ్యా (29 పరుగులు), గజన్ఫర్ (17 పరుగులు) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక ఓవర్‌లో 11 పరుగులు ఇచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>