కలం, భువనగిరి : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో ఉద్యానవన రంగ అభివృద్ధిపై కీలక సమీక్షా సమావేశం జరిగింది. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) అధ్యక్షతన ఉద్యానవన శాఖపై నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు అధిక ఆర్థిక లాభాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రాయితీలు ప్రతి అర్హత కలిగిన రైతుకు చేరేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.
డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు పద్ధతులను విస్తృతంగా అమలు చేయాలని అధికారులకు ఆయన (MP Chamala) ఆదేశించారు. సబ్సిడీలు, నాణ్యమైన విత్తనాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యానవన విస్తీర్ణాన్ని పెంచేందుకు దీర్ఘకాల ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా హార్టికల్చర్ అధికారి మాధవి, వివిధ మున్సిపల్ చైర్మన్‌లు , వైస్ చైర్మన్‌లు , ప్రజాప్రతినిధులు, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Also: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఏఐసీసీ నాయకులతో చర్చ
Follow Us On : WhatsApp

