Mobile Popup Ad
Mobile Popup Ad

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొంగులేటి

కలం, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ రైతు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం హనుమకొండ (Hanumakonda) జిల్లా ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘మెగా రైతు మేళా’ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. ముందుగా మంత్రులు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, సాంకేతిక స్టాళ్లను సందర్శించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యంత్రాలు, పథకాలపై అవగాహన పొందారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం పలు కీలక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్, ఎకరాకు రూ.12,000 రైతు భరోసా, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ‘భూభారతి’ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతి ప్రభుత్వమని స్పష్టం చేశారు. మే 5, 6, 7 తేదీలలో కొనసాగనున్న ఈ రైతు మేళాలో రైతులకు వ్యవసాయ యాంత్రిక పరికరాలను సబ్సిడీపై అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు మేళా వేదికగా భూసార పరీక్షలు నిర్వహించిన అధికారులకు మంత్రి గారు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, KUDA చైర్మన్ ఇనుగాల వెంకట్రామ రెడ్డి, ఓవ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, హార్టికల్చర్ సెక్రటరీ యాస్మిన్ బాషా, వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారదా చాహత్ బాజ్ పాయ్, ప్రజాప్రతినిధులు, జిల్లాల ఆధికారులు, రైతులు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Read Also: 7న విజయ్ ప్రమాణ స్వీకారం? రేపు గవర్నర్‌తో భేటీ

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>