మిల్లుల్లో అన్‌లోడింగ్ పెంచాలి : స్టీఫెన్ రవీంద్ర

కలం, నకిరేకల్ : రైసు మిల్లుల వద్ద అన్‌లోడింగ్ పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ (Civil Supplies Commissioner) స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) ఆదేశించారు. అన్‌లోడింగ్‌తోపాటు వెహికల్ రోటేషన్, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించడం, లారీలు, హమాలీలను పెంచాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పెదకాపర్తి కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం వివరాలు, హమాలీలు, ట్రక్ షీట్లు, మిల్లుల ట్యాగింగ్ చేసిన వాహనాలు, టార్పాలిన్లు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, కేంద్రం నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అన్ని పెద్ద సెంటర్లలో 10 నుండి 20 వరకు అదనపు లారీలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సివిల్ సప్లై కమిషనర్ కు వివరించారు. హమాలీల కొరత లేకుండా మిల్లర్లకు ముందే సమాచారం ఇచ్చామని, ఒక్కో కొనుగోలు కేంద్రంలో 30 వరకు హమాలీలు ఉన్నారని, అదేవిధంగా మిల్లుల్లో సైతం 30 నుండి 35 వరకు హమాలీలను ఉంచామని తెలిపారు.

ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీపెన్ రవీంద్ర (Stephen Ravindra) మాట్లాడుతూ.. ట్యాబ్ ఎంట్రీ నూటికి నూరు శాతం కావాలని, కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని శుభ్రపరిచేందుకు డ్రయ్యర్లు, శుభ్రపరిచే విధానాలను అడిగి తెలుసుకున్నారు. గన్ని బ్యాగుల వివరాలను, టార్పాలిన్లను గురించి అడిగారు. అవసరమైతే అదనపు టార్పాలిన్లు కొనుగోలు కేంద్రాలలో పెట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ జీఎం నాగేశ్వర రావు, ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి, పౌరసరఫరాల శాఖ వెంకటేశం, డీఎం రాంపతి నాయక్, డీసీఓ పత్యా నాయక్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, చిట్యాల తహసిల్దార్ విజయ్ తదితరులు ఉన్నారు.

Read Also: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఏఐసీసీ నాయకులతో చర్చ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>