కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు యంత్రాంగం, భువనగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అరైవ్.. అలైవ్’ రోడ్డు భద్రతా వారోత్సవాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ (MP Chamala) మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో ప్రజల రక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. రహదారి ప్రమాదాలను తగ్గించాలంటే ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి ప్రాథమిక భద్రతా చర్యలపై ప్రజల్లో అవగాహన పెరగాలని అన్నారు.
అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజాపాలన ద్వారా పారదర్శక సేవలు అందించడంతో పాటు రహదారి క్రమశిక్షణతో ప్రాణాలను కాపాడుకోవాలని అధికారులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు వారం రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే పోస్టర్‌లను ఎంపీ (MP Chamala) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అదనపు డీజీపీ మహేష్ భగవత్, జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
Read Also: జగిత్యాలలో కేసీఆర్ సభ.. కేటీఆర్ కీలక ప్రకటన!
Follow Us On: X(Twitter)

