కొన్నికొన్ని విషయాలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందా అనిపిస్తుంటుంది. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి తిరుపతి(Tirupati) జిల్లా కేవీబీపురం మండలంలో చోటు చేసుకుంది. కూతురును పెళ్ళి చేసుకున్న అబ్బాయితోనే అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. అల్లుడిని పెళ్ళి చేసుకోవడానికి కూడా రెడీ అయింది. అడ్డు చెప్పిందని కూతురినే హత్య చేయడానికి ప్రయత్నించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేవీబీపురం మండలంలోని ఓ గ్రామంలో 18 ఏళ్ల బాలుడు, 15 ఏళ్ల బాలిక ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త చనిపోవడంతో బాలిక తల్లి కూడా కూతురు దగ్గరే ఉంటుంది.
Tirupati | ఎప్పుడు ఎలా మొదలైందో తెలీదు కానీ.. అల్లుడికి, అత్తకి మధ్య సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా అల్లుడితో అత్త వివాహేతర సంబంధాన్ని నడుపుతోంది. అక్టోబర్ 3 శుక్రవారం రోజున కూతురు ముందే అల్లుడిని పెళ్ళి చేసుకోవడానికి ఆమె రెడీ అయిపోయింది. అల్లుడు కూడా పెళ్ళి రెడీ అనడంతో ఇక వారిని ఆపేవారే లేకుండా పోయారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన కూతురు.. తల్లి మెడలో తాళి కడుతున్న భర్తను అడ్డుకుంది బాలిక.
దాంతో ఆగ్రహించిన తల్లి, భర్త.. కలిసి బాలికపై దాడి చేశారు. రోకలి బండతో కొట్టి చంపేయాలనుకున్నారు. కానీ బాలిక కేకలు వేయడంతో స్థానికులు పరుగులు పెడుతూ అక్కడికి వచ్చారు. బాలికను రక్షించి ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న అత్త, అల్లుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

