కోల్డ్‌రిఫ్ సిరప్(Coldrif Syrup) బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో Coldrif సిరప్ తాగిన 11 మంది పిల్లలు చనిపోయారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ సిరప్ ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాడులోని కాంచీపురం జిల్లా, సుంగువర్చతిరంలోని శ్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్‌రిఫ్ సిరప్(Coldrif Syrup) తాగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ కి చెందిన 11 మంది పిల్లలు మరణించారు. ఈ నివేదికల గురించి తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది. ఈ సిరప్ విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్ (DEG)తో కల్తీ చేయబడిందని ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో కోల్డ్‌రిఫ్ సిరప్, బ్యాచ్ నం. SR-13 ను ఎవరైనా తమ దగ్గర ఉంటే వెంటనే వాడటం మానేయాలని, ఆలస్యం చేయకుండా స్థానిక డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు నివేదించాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది.

