epaper
Tuesday, November 18, 2025
epaper

సుహాస్ మూవీ షూటింగ్ ప్రమాదం.. బోల్తా పడిన పడవ

Suhas Mandaadi | సుహాస్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. చిన్న హీరో అయినా.. మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తన మార్క్ చూపించుకుంటున్నాడు. సుహాస్ చేస్తున్నాడు అంటే ఆ సినిమాకు మినిమం కలెక్షన్లు పక్కా. కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుహాస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో ప్రధాన పాత్రలో కనిపించాడు. తాజాగా సుహాస్ ఓ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అదే ‘మండాడి’ మూవీ. ఇందులో తమళ నటుడు సూరి హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్‌లో భారీ ప్రమాదం జరిగింది. చెన్నై సముద్ర తీరంలో పడవపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారు. వారితో పాటు కెమెరాలు సహా ఇతర పరికరాలు సముద్రంలో పడిపోయాయి. కాగా వెంటనే స్పందించిన యూనిట్.. నీటిలో పడిపోయిన వారిని రక్షించింది. కాగా సముద్రంలో పడిపోయిన సామాగ్రి మాత్రం కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంతో మూవీ యూనిట్‌కు సుమారు రూ.కోటి రూపాయల నష్టం జరిగిందని తెలుస్తోంది.

Suhas Mandaadi | ఈ మూవీతో సుహాస్.. తమిళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటికే పాత్ర ఏదైనా అదరగొట్టే టాలెంటెడ్ యాక్టర్ అన్న పేరును సుహాస్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అయితే పడవ ప్రమాద సమయంలో సుహాస్ అక్కడ ఉన్నాడా? లేదా? అనేది యూనిట్ ప్రకటించాల్సి ఉంది.

Read Also: అభిషేక్, ఐశ్వర్య పోరాటానికి దిగొచ్చిన యూట్యూబ్
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>