కలం, వెబ్ డెస్క్: మనుషులకు, వానరాలకు మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. భావోద్వేగాలను పంచుకోవడంలో కోతులు కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. అడవుల్లో ఉండే కోతులు జనారణ్యంలోకి వచ్చినప్పుడు చాలామంది పండ్లు ఇచ్చి ఆదరించడం చూస్తుంటాం. మనుషుల మనవత్వాన్ని గుర్తుపెట్టుకొని అవి కూడా స్నేహంగా మెలుగుతాయి. ఈ నేపథ్యంలో ఓ వృద్ధురాలి మరణంతో వానరం (Monkey) బోరున ఏడ్చిన ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది.
కర్ణాటకలోని (Karnataka) చన్నపట్టణలో కోతి నిస్వార్థ ప్రేమకు నిదర్శనంగా నిలిచే విషాదకర ఘటన జరిగింది. తనకు ప్రతిరోజూ ఆహారం పెట్టి ఆదరించిన 85 ఏళ్ల బామ్మ మరణించిందన్న వార్త వానరం గుర్తించింది. పసిపిల్లాడిలా బోరున ఏడ్చింది. ఆమె మృతదేహంపై వాలిపోయి, విడవకుండా అక్కడే ఉండిపోయింది. రక్తసంబంధీకులే బంధాలను మర్చిపోతున్న నేటి స్వార్థపూరిత సమాజంలో కోతి చూపిన ప్రేమను పలువురిని కదిలించింది. కేవలం అన్నం పెట్టిన మమకారంతో ఆ వానరం చూపిన ప్రేమ ఆలోచింపజేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశ్వాసానికి నిలువుటద్దం.. ఈ వానరం!
కర్ణాటకలోని చన్నపట్టణంకు చెందిన ఒక 85 ఏళ్ల వృద్ధురాలు గత కొంతకాలంగా ఒక వానరానికి ప్రతిరోజూ ప్రేమతో ఆహారం పెట్టేది. ఆ బామ్మ చూపిన ఆదరణకు ఆ వానరం ఆమెకు ఎంతో దగ్గరైంది. అయితే, వృద్ధాప్యంతో ఆ బామ్మ కన్నుమూయడంతో ఆ మూగజీవి తట్టుకోలేకపోయింది. బామ్మ… pic.twitter.com/vd2AX7iLwU— Kalam Daily (@kalamtelugu) April 1, 2026
Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!
Follow Us On: X(Twitter)

