Mobile Popup Ad
Mobile Popup Ad

మిడ్ డే మీల్స్‌లో బ‌ల్లి.. స్కూల్‌లో పేరెంట్స్ ఆందోళ‌న‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ప్ర‌భుత్వ పాఠ‌శాల మిడ్ డే మీల్స్‌ (Midday Meal)లో బ‌ల్లి ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం క‌ల‌క‌లం రేపింది. ఏపీలోని పుంగ‌నూరు (Punganur)లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నగిరి కాంపౌండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో బుధ‌వారం పిల్ల‌ల‌కు పెట్టిన మ‌ధ్యాహ్న భోజ‌నంలో బ‌ల్లి ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ భోజ‌నం తిన్న న‌లుగురు విద్యార్థుల‌కు వాంతులు అయ్యాయి. దీంతో పాఠ‌శాల ఉపాధ్యాయులు వెంట‌నే డాక్ట‌ర్ల‌కు స‌మాచారం అందించారు. డాక్ట‌ర్లు పాఠ‌శాల‌కు చేరుకొని విద్యార్థులకు వైద్య‌ పరీక్షలు నిర్వహించారు. ఈ విష‌యం స్థానికంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌మాచారం అందుకున్న విద్యార్థుల‌ తల్లిదండ్రులు పాఠ‌శాల‌కు చేరుకొని ఆందోళ‌న చేప‌ట్టారు. విద్యార్థుల‌కు పెట్టే ఆహారం విష‌యంలో ఇంత నిర్ల‌క్ష్యంగా ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ప్ర‌శ్నించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. త‌ల్లిదండ్రుల ఆందోళ‌న‌తో పాఠ‌శాల‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌స్తుతానికి విద్యార్థులు అంద‌రూ క్షేమంగానే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Read Also: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>