epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నడ్డాను కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్​ రామచందర్​ రావు

కలం, వెబ్​ డెస్క్​ : కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడితో తెలంగాణ బీజేపీ చీఫ్​ రామచందర్​ రావు ( Ramchander Rao ) భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రామచందర్​ రావు మంగళవారం నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ సమీకరణలపై ఇరువురు చర్చించారు.

తెలంగాణలో బీజేపీతో పాటు ప్రధాని మోడీపై పెరుగుతున్న ఆదరణ గురించి కేంద్రమంత్రికి రామచందర్​​ రావు వివరించారు. కాంగ్రెస్​ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు, తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాలపై కేంద్రమంత్రి నడ్డా రామచందర్​ రావుకు దిశానిర్దేశం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>