కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ (IAS officers transfers) చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు రిలీజ్ చేసింది. శ్రీజన, వినయ్ కృష్ణారెడ్డి లను జీహెచ్ ఎంసీ అడిషనల్ కలెక్టర్లుగా నియమించింది. పంచాయతీ రాజ్ కమిషనర్ గా శృతి ఓజా అపాయింట్ అయ్యారు. నల్గొండ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఇలా త్రిపాఠి నిజామాబాద్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆమె స్థానంలో నల్గొండ నూతన కలెక్టర్గా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ బడగు చంద్రశేఖర్ నియమితులయ్యారు. నారాయణపట అడిషనల్ కలెక్టర్ గా ఉమాశంకర్ నియామకం.


