మోనాలిసా పెళ్లిలో బిగ్ ట్విస్ట్.. భర్త కు హైకోర్టులో ఊరట

కలం, వెబ్ డెస్క్ : ప్రయోగ్ రాజ్ మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మోనాలిసా (Monalisa) పలు సినిమాల్లో నటిస్తోంది. సెలబ్రెటీగా మారిపోయిన ఈ పూసాల పాప ఇటీవల ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను ప్రేమ పెళ్లి  చేసుకుని అందరికీ షాకిచ్చింది. మోనాలిసా మైనర్ అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించడంతో  ఈ పెళ్లి వివాదస్పదమయ్యింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో మోనాలిసా మైనర్ అని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCST) నిర్ధారించింది. దీంతో మైనర్ ను వివాహం చేసుకోవడమే కాకుండా, ఆమెను బలవంతంగా తీసుకెళ్​లారన్న ఆరోపణలతో ఫర్మాన్​ ఖాన్ పై పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను సవాలు చేస్తూ ఫర్మాన్ కోర్టును ఆశ్రయించగా… అతనికి కేరళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో మే 20వ తేదీ వరకు ఫర్మాణ్​ ఖాన్‌ ను అరెస్ట్ చేయవద్దని, అతనికి రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలాఉంటే మోనాలిసా (Monalisa) కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఫర్మాన్ ఖాన్ బాంబ్ పేల్చాడు. ఈ మేరకు తన భార్య ఆచూకీ తెలియడం లేదని ఆదివారం ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ మోనాలిసా మిస్సింగ్ అంటూ భర్త ఫర్మాన్ ఖాన్ వీడియో రిలీజ్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Read Also: ప్రభుత్వ ఉద్యోగం పేరుతో కోట్ల కట్నం డిమాండ్.. ఘరానా మోసగాడి అరెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>