ఐలాపూర్‌లో కొనసాగుతున్న హైడ్రా ఆక్రమణల తొలగింపు

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ (Ailapur) గ్రామంలో హైడ్రా (HYDRAA) ఆక్రమణల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే చర్యల్లో భాగంగా ఫెన్సింగ్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ భారీ ఆపరేషన్ మూడవ రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా న్యాయవాది ముకీం సోదరుడు అజీమ్ అక్రమంగా నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని భారీ క్రేన్ల సహాయంతో దాదాపు పూర్తిగా కూల్చివేశారు.

మునుపటి రోజు కూల్చివేతలో పక్కనున్న అపార్టుమెంట్లపై శిథిలాలు పడిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఈరోజు ఎలాంటి నష్టం జరగకుండా హైడ్రా (HYDRAA) అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే 861 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడం వేగంగా కొనసాగుతోంది. అధికారులు స్వయంగా అక్కడే ఉండి ఆక్రమణల తొలగింపు, ఫెన్సింగ్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రభుత్వ భూముల్లో ఉన్న షాపులు, ఇతర అక్రమ నిర్మాణాలను కూడా పోలీసుల బందోబస్తు మధ్య తొలగించారు.

Read Also: మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్ : సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>