Mobile Popup Ad
Mobile Popup Ad

లవ్ జిహాద్ కేసులో కీలక పురోగతి.. వెలుగులోకి సంచలన విషయాలు

కలం, వెబ్ డెస్క్: లవ్ జిహాద్ కేసు(Love Jihad Case)లో దర్యాప్తు బృందం కీలక పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. నాసిక్‌లోని టీసీఎస్ కంపెనీలో లవ్ జిహాద్ జరిగినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా రేపింది. ప్రస్తుతం సిట్ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.  ఈ కేసులో కీలక అంశాలను దర్యాప్తు బృందం గుర్తించింది. లవ్ జిహాద్ బాధితులను సోషల్ మీడియా ద్వారా కూడా వేధించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. బాధితులను ప్రలోభాలకు గురి చేసేందుకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల సందేశాలు పంపినట్టు తెలుస్తోంది. ఈ సందేశాల్లో అశ్లీల వ్యాఖ్యలు, అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఏడుగురు నిందితుల అరెస్ట్

ఈ కేసుకు (Love Jihad Case) సంబంధించి ఇప్పటికే పోలీసులను ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. కీలక నిందితురాలు నిదా ఖాన్ మాత్రం ఇంకా పరారీలోనే ఉండటం గమనార్హం. పోలీసులు విచారణలో భాగంగా నిందితుల మొబైల్ ఫోన్లు సీజ్ చేసి సోషల్ మీడియా ఖాతాల నుంచి డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. డిలిట్ చేసిన డాటా.. చాట్ లాగ్‌లను టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ సహాయంతో రికవరీ చేస్తున్నారు. నిందితులు కార్యాలయంలోని ఇతర మహిళా ఉద్యోగులకు కూడా అసభ్యకర సందేశాలు పంపించారా? ఆ సందేశాల్లో మతపరమైన అజెండా ఉందా ? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోెంది.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసు

ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ రంగంలోకి దిగింది. టీసీఎస్  (TCS) కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, రాష్ట్ర పోలీసు అధికారుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు పంపించింది. నాషిక్ జిల్లా పోలీసు అధికారులకు పూర్తి దర్యాప్తు చేసి యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్)సమర్పించాలని ఆదేశించింది. టీసీఎస్ సీఈఓను Prevention of Sexual Harassment) కమిటీ వివరాలు, గత మూడేళ్లలో దాని కార్యకలాపాలు, అందులో వచ్చిన అన్ని ఫిర్యాదుల వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్ర లేబర్ కమిషనర్‌కు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని టీసీఎస్ బ్రాంచ్‌లు, బీపీవోల వివరాలు, వాటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ డాక్యుమెంట్లు అందించాలని కోరింది. ఈ కేసును సిట్ ఎంక్వైరీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తోంది.

Read Also: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోదీ సర్‌ప్రైజ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>