సీఎం విజయ్‌ని కలిసిన సమంత.. రియల్ హీరో అంటూ ప్రశంసల వర్షం

కలం, వెబ్ డెస్క్: నటి సమంత (Samantha) బుధవారం చెన్నైలో సీఎం విజయ్‌ని ప్రత్యేకంగా కలిశారు. తమిళనాడులో టీకేవీ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆయనకు అభినందనలు తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. విజయ్ సర్ (CM Vijay) ఎప్పుడూ కేవలం వెండితెర హీరోగా మాత్రమే మిగిలిపోవడానికి పుట్టలేదని, ఆయనకున్న ఎనర్జీ అంతకంటే పెద్ద స్థానానికి చేరుకుంటారని ముందే ఊహించానని సమంత అన్నారు. విజయవంతమైన సినీ కెరీర్‌ను పక్కనబెట్టి, సమాజం కోసం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి ఎంతో ధైర్యం కావాలని, విజయ్ తీసుకున్న నిర్ణయం ఎంతగానో స్ఫూర్తినింపిందని సమంత కొనియాడారు.

మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సమాజం కోసం ఏదైనా చేయాలనే పిలుపు వస్తుందని, కానీ కొద్దిమంది మాత్రమే ఆ పిలుపునకు స్పందిస్తారని అన్నారు. విజయ్ సార్ తన పదవి కంటే కూడా సమాజంపై మంచి సంకల్పంతో పనిచేస్తారని అన్నారు. తనను నమ్మిన వారందరూ ఆశ్చర్యపోయేలా సరికొత్త నిర్ణయాలతో దూసుకుపోతారనే నమ్మకం తనకు ఉందని సమంత (Samantha) ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Read Also: మనమే ఫేమస్ కపుల్.. మోదీతో ఇటలీ ప్రధాని మెలోని సంభాషణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>